నెల్లూరు జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు - sivaratri celebrations
🎬 Watch Now: Feature Video
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలోని అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. నగరంలోని మూలస్థానేశ్వరుడు, రాజరాజేశ్వరీ ఆలయం, గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేటల్లోని ఆలయాల్లో భక్తులు ముక్కంటి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.