Sand Art: పోరాట యోధుల త్యాగాలు.. ఆకట్టుకున్న శాండ్ ఆర్ట్ - latest news in guntur district
🎬 Watch Now: Feature Video
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ ప్రత్యేక వీడియో రూపొందించారు. బ్రిటిషర్ల నుంచి భరతమాత విముక్తి కోసం పోరాడిన మహనీయుల చిత్రాలను శాండ్ ఆర్ట్‌లో పొందుపర్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగం వల్లే మనం స్వాతంత్య్రం పొంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని చెబుతూ.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతున్న వైనాన్ని చిత్రించారు.