తిరుమల బ్రహ్మోత్సవాలు..ఘనంగా ధ్వజారోహణం
🎬 Watch Now: Feature Video
కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో వేడుకలు మొదలయ్యాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి ఉన్నందున కేవలం రూ.300 లు ఆన్లైన్ టికెట్లున్న వారికి తితిదే దర్శనాలను పరిమితం చేసినా..పెరటాసి మాసం మొదటి శనివారం కావడంతో తమిళనాడు, కర్ణాటక, సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారినే అనుమతిస్తామంటూ పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది వారికి నచ్చజెప్పి వెనక్కి పంపిస్తున్నారు.