రాష్ట్రంలో వర్షాల జోరు.. ఉద్ధృతంగా గోదావరి - Godavari river
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాలను ముంచెత్తుతోంది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్నేరు ఉద్ధృతి కొనసాగుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన్యం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్ట్ లోకి వరద నీరు భారీగా చేరుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం మండలం గోదావరి ఒడ్డున ఉన్న గండి పోశమ్మ ఆలయం నీట మునిగింది. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వర వద్ద 9.5 ఆడుగులకు నీటిమట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది. భారీ స్థాయిలో వరదనీరు పోలవరం ప్రాజెక్టులో వచ్చి చేరింది. గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.