TIRUMALA: శోభాయమానంగా తిరుమల శ్రీవారి పుష్పపల్లకి సేవ - తిరుపతిలో పుష్పపల్లకీ సేవ వార్తలు
🎬 Watch Now: Feature Video
తిరుమలలో పుష్పపల్లకీ సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి.. శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లు కలిపి ఒక టన్ను పుష్పాలతో హంస ఆకారంలో పల్లకీని అలంకరించారు. పల్లకీ ముందు వైపు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మధ్య భాగంలో చిన్నికృష్ణుడు, వెనుకవైపు బాల ఆంజనేయస్వామివారి ఆకృతులను రూపొందించారు. అందమైన పల్లకీలో చిరుజల్లుల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహళంగా సాగింది.