తిరుమలలో వైభవంగా శ్రీనివాసుని వార్షిక తెప్పోత్సవం
🎬 Watch Now: Feature Video
శ్రీనివాసుని వార్షిక తెప్పోత్సవం నాల్గవరోజు తిరుమలలో వైభవంగా సాగింది. తెప్పోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి తిరుచ్చీ వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి వద్దకు వేంచేపు చేశారు. కోనేటిలో తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులైన స్వామివారు ఐదుసార్లు ప్రదక్షిణంగా విహరించారు. విశేష తిరువాభరణాలు, పరిమల భరిత పూలమాలలతో ఆళంకారభూషితులైన స్వామి.. అమ్మవార్లు వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తిసంకీర్తనల మధ్య.. తెప్పోత్సవం వైభవంగా సాగింది.