తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు..సర్వభూపాల వాహనంపై శ్రీవారు - thirumala latest news
🎬 Watch Now: Feature Video
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో కలిసి ఉట్టి కృష్ణుడి అలంకారంలో కనిపించారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించొచ్చు.