ప్రతిధ్వని: వాయుసేన అమ్ముల పొదిలో రఫేల్.. బలం ఏ స్థాయిలో..! - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
భారత వైమానిక దళ అమ్ములపొదిలో అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు చేరబోతున్నాయి. విశిష్ట నిర్మాణం, ఆయుధాలు, సెన్సార్ల వల్ల రఫేల్ పూర్తి స్థాయి బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రఫేల్.. శత్రు భూభాగంలోకి వెళ్లి భీకర దాడులు చేయగలదు. మన భూభాగంలోనే ఉండి ముష్కర స్థావరాలపై పిడుగుల వర్షం కురిపించగలదు. యుద్ధ నౌకలను విధ్వంసం చేయగలదు. సముద్రం, నేల, నింగిల్లోనూ ప్రత్యర్థులను పసిగట్టగలదు. శత్రువుల రాడార్‌ను జామ్ చేయగలదు. అణ్వస్త్రాలను కూడా ప్రయోగించే సామర్థ్యం రఫేల్‌కు ఉంది. ఈ నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన ఏ స్థాయిలో బలోపేతం కానుంది.. వంటి అంశాలకు సంబంధించి.. ప్రతిధ్వని చర్చా కార్యక్రమం..!