ప్రతిధ్వని: చైనా దుర్మార్గం - ప్రతిధ్వని వార్తలు
🎬 Watch Now: Feature Video
భారత్ - చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి చైనా సైనికులు చేసిన దాడిలో భారత్‌కు చెందిన ఒక కల్నల్‌తోపాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. చనిపోయిన వారిలో తెలంగాణలోని సూర్యపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాలు బాహాబాహి తలపడిన సందర్భాలు ఉన్నా ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఓ పక్క సైనికాధికారులు చర్చలు జరుగుతుండగా.. మరోపక్క ఈ ఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితి ఎటు వెళుతుందో అన్న అందోళన వ్యక్తవుతోంది. అయితే భారత్ సరిహద్దులో ఏం జరుగుతోంది..అక్కడ భారత్ చేపడుతున్న చర్యలేంటి అనే అంశాల పై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jun 17, 2020, 7:59 AM IST