thumbnail

Prathidhwani: చమురు మంటకు అసలు కారణం ఎవరు ?, ఎవరి వాటా ఎంత..?

By

Published : Apr 28, 2022, 11:00 PM IST

Prathidhwani: పెట్రో మంటలో ఎవరి వాటా ఎంత? వేసవి ఎండల్నిమించి హఠారెత్తిస్తున్న చమురుమంటల సెగ తగలని వారు లేరు ఇప్పుడు. నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండడం లేదు. అవే డబ్బులు.. అవే పెట్రోల్. కానీ.. వచ్చే పరిమాణం తగ్గుతోంది. ఇచ్చే మొత్తం పెరుగుతోంది. ఇలా అయితే బతికేది ఎలా అన్న ఆవేదన, ఆక్రోశాలే.. అన్ని వైపుల నుంచి. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్‌ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. వెంటనే విపక్షాల నుంచి ఈ మంటలకు కారణం ఎవరన్న ప్రశ్నలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే చమురు చిచ్చుకు కారణం ఎవరు? ఇప్పుడు చేపట్టాల్సిన దిద్దుబాట ఏమిటి? ఇదే అంశాలపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని కార్యక్రమం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.