డుడుమ జలపాతం.. ప్రకృతి అందాల సోయగం - డుడుమ జలపాతం
🎬 Watch Now: Feature Video
పచ్చని చెట్ల మధ్య... ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల అందాలు.... ప్రకృతి సోయగాలకు నిలయాలు. ఓవైపు ఎర్రని రంగుతో... మరోవైపు తెల్లని వర్ణంతో... ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం సరికొత్తగా దర్శనమిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... లోయలోకి చేరుతున్న వరదనీరు.. ఆ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకువస్తోంది. 550 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న డుడుమ జలపాతం సోయగాలు... ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్నాయి.