టోల్‌ప్లాజా వద్ద విమానం, అంతా షాక్, వీడియో వైరల్ - aeroplane at indalevai toll plaza
🎬 Watch Now: Feature Video
Aeroplane at toll plaza ఇతర వాహనాలతో పాటు టోల్‌ప్లాజా గేటు వద్ద విమానం కూడా ఆగింది. అదేంటీ, ఎయిర్ పోర్టులో ఉండాల్సిన విమానం టోల్ ప్లాజా వద్ద ఏమిటీ అని అనుకుంటున్నారా.. మీరే కాదు, టోల్ ప్లాజా సిబ్బందితో పాటు.. వాహనదారులు కూడా ఆశ్చర్యంగా ఆ విమానాన్ని తిలకించారు. తీక్షణగా పరిశీలిస్తే గానీ అసలు విషయం బోదపడలేదు. కొత్తగా తయారు చేసిన విమాన పైభాగాన్ని 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు లారీపై తరలిస్తున్నారు. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని కాసేపు ఆపారు. దీంతో స్థానికులు విమానాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారాయి.