సంక్రాంతి విశిష్టత ఏంటి?... పొంగళ్లు ఎందుకు పెడతారు? - సంక్రాంతిపై ఈటీవీ ప్రతిధ్వని వార్తలు
🎬 Watch Now: Feature Video
శ్రమైక జీవన సౌందర్యానికి, సామాజిక సమైక్య మాధుర్యానికి ప్రతీక సంక్రాంతి. సర్వజన హితాన్ని ఆకాంక్షిస్తూ, సమష్టి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పండగ. తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన, ముగ్ధమనోహరమైన మూడు పండగల సమాహారంగా సంక్రాంతి సౌందర్యం వెల్లివిరుస్తుంది. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానిక పరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవ్య ఉషస్సుతో, భవ్య తేజస్సుతో తరలివచ్చిన సంక్రాంతి శోభపై ప్రతిధ్వని చర్చ.