ప్రతిధ్వని: కమ్మేసిన కరోనా వైరస్... రాష్ట్రాల్లో ఆరోగ్య సంక్షోభం - కరోనా వైరస్‌పై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ దేశం మొత్తాన్ని కకావికలం చేస్తోంది. సత్వర స్పందనలు, తక్షణ తరుణోపాయాలు, వనరుల సద్వినియోగంతోనే ఇప్పుడు కరోనా విలయం నుంచి గట్టెక్కే ఆత్మవిశ్వాసం లభిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సామర్థ్యాన్ని హేతుబద్ధంగా వినియోగించుకోవాల్సిన సమయమిది. రోగ నిర్ధరణ పరీక్షలు, వైద్య ఉపకరణాలు, ప్రాణ రక్షర ఆక్సిజన్, ఔషధాలను విచక్షణతో అందించాల్సిన పరిస్థితి. దేశం ఇలాంటి క్లిష్టం సందర్భంలో ఉన్నవేళ ప్రభుత్వాలు అనుసరించాల్సిన ఆపత్కాల వైద్య విధానం ఎలా ఉండాలి? ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, ఫార్మా కంపెనీలపై ఉన్న గురుతర బాధ్యత ఎంత? వనరుల నిర్వహణలో ప్రభుత్వం అనుసరించాల్సిన పరిణతి ఏంటి? ఈ అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.