ప్రతిధ్వని: నకిలీ విత్తన ముఠాలకు అడ్డుకట్ట ఎలా? - ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video

వర్షం కురియగానే రైతు జ్ఞాపకం చేసుకునే మొదటి విషయం విత్తనం. మంచి విత్తనం చేతికొస్తే పంట దిగుబడి పెరుగుతుందన్న ఆశ రైతును ఏటా కడగండ్ల పాలు చేస్తోంది. నకిలీ విత్తనాల బెడద రైతును కష్టాల్లోకి తోసేస్తోంది. విత్తన కంపెనీల మోసాలు, నాసిరకం విత్తన కష్టాలతో రైతన్న పొలంలో చల్లుతున్న విత్తనాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. వ్యవసాయంలో రైతన్న వెన్ను విరుస్తున్న నకిలీ విత్తనాలకు కారకులెవరు? విత్తన సరఫరాదారుల అత్యాశకు, వ్యవసాయ అధికారుల అలసత్వం నుంచి రైతులకు ఎదురవుతున్న కష్టాలు తీరేదెలా ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.