కరోనా కల్లోలం: రెమ్‌డెసివర్ ధరకు రెక్కలు.. మోసపోతున్న బాధితులు - remdesivir shortage in india news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11559439-707-11559439-1619534963208.jpg)
ఒక వైపు కరోనా పంజా విసురుతుంటే... ఇంకోవైపు కొవిడ్ మందుల మాఫియా రాబందులా దాడి చేస్తోంది. వైరస్ దాడిలో చిక్కి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నిస్సహాయుల ప్రాణాలతో లాభాల వ్యాపారం చేస్తోంది. ప్రాణరక్షక ఔషధాల కొరతను సృష్టిస్తున్న కొందరు... మానవత్వం మరచిన మృగాలను తలపిస్తున్నారు. కొవిడ్ దాడికి గురై విలవిల లాడుతున్న బాధితులకు అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కుల చీకటి దందాపై సత్వరమే కొరఢా ఝళిపించాల్సిన సందర్భం ఇది. అసలు కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడుతున్న రెమ్‌డెసివర్ ధరకు ఎందుకు రెక్కలొచ్చాయి? అవసరమైనంతగా ఉత్పత్తి చేసుకోగలిగే అవకాశం ఉన్నాకూడా మార్కెట్లో ఎందుకు కొరత ఎర్పడింది? బాధితులు మోసపోతున్నది ఎక్కడ? ఈ అంశంపై ఈరోజు ప్రతిధ్వని.