ప్రతిధ్వని: యువత - ఉద్యోగ సవాళ్లు - corona
🎬 Watch Now: Feature Video
కరోనా సృష్టించిన సంక్షోభానికి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రతి రంగం ఆర్థికంగా కుంగిపోయిన తరుణంలో ఉద్యోగాలపై కోత పడుతోంది. ఈ తరుణంలో.. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న పట్టభద్రుల ముందు.. అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. ఉద్యోగ భవిష్యత్తు గురించి ప్రపంచ వ్యాప్తంగా యువత.. తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో.. 2020 పట్టభద్రులకు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ఇచ్చిన సందేశం.. యువతరానికి స్ఫూర్తినిస్తోంది. యువతకు ఇలాంటి సవాళ్లు కొత్త కాదు.. దేన్నైనా మార్చగలిగే శక్తి యువతకు ఉంది... ఎలాంటి పరిస్థితులనైనా అంగీకరించేందుకు యువత సిద్ధంగా ఉండాలి.. అంటున్నారు.. సుందర్ పిచ్చాయ్. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల పరంగా యువత ముందున్న సవాళ్లు ఏంటి? సంక్షోభంలోనూ యువతకు ఉన్న అవకాశాలు ఏమిటన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.