PRATHIDWANI: నెలకు రూ.వందల్లో పెన్షన్ వస్తే బతికేది ఎలా?: సీపీఎస్ ఉద్యోగులు - prathidwani discussion on CPS Employees Pension
🎬 Watch Now: Feature Video
పింఛనుకు భరోసా లేదు... బతుక్కి భద్రత లేదు... 30ఏళ్లు ఉద్యోగం చేసి.. పదవీ విరమణ తర్వాత నెలకు వందల్లో పెన్షన్ వస్తే బతికేది ఎలా? మలిసంధ్యలో కుటుంబాన్నిపోషించుకోవడం ఎలా? ఇది కొద్దిరోజులుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సూటి ప్రశ్న. ఆ పరిస్థితి మార్చండి మహాప్రభో అని.. లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిరసనలు.. నినాదాలతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సర్కార్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నామంటున్నా.. అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. అదే ఈ రోజు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.