ప్రతిధ్వని: అగ్రరాజ్యంలో అలజడి..క్యాపిటల్​ బిల్డింగ్​పై దాడి - ప్రతిధ్వని వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 8, 2021, 9:55 PM IST

అగ్రరాజ్యం అమెరికాలో ఊహించని రీతిలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్​ ధ్రువీకరణ ప్రక్రియను అడ్డుకొనేందుకు.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్​ మద్దతుదారులు క్యాపిటల్​ బిల్డింగ్​పై దాడిచేసి విధ్వంసాన్ని సృష్టించారు. గోడలు ఎక్కి కిటికీ అద్దాలు పగులగొట్టి.. దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యంలోని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడికి నిరసనగా పలువురు ప్రముఖులు రాజీనామాలు చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ జో బైడెన్​.. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో నిలువుటద్దంలా చెప్పుకునే అగ్రరాజ్యంలో ఇలాంటి దాడి జరగడంపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.