రాశి ఫలం: మిథునం - horoscope
🎬 Watch Now: Feature Video

ఆదాయం:2 , వ్యయం:11, రాజపూజ్యం:2, అవమానం:4
ఈ రాశి వారికి ఈ ఏడాది శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ.. తోడబుట్టిన వాళ్లు, తల్లిదండ్రులు, కొండంత అండగా నిలుస్తారు. శ్రమించే తత్వంతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పని చేయడానికి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సంబంధమైన విషయాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఈ ఏడాది అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలోని వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాల్లో విద్యనభ్యసించడానికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి.