కుసుమం..కనువిందు చేస్తోంది...! - flower show in vijayawada
🎬 Watch Now: Feature Video

విజయవాడలో ఫలపుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగరవాసులు మనసు దోస్తోంది. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ మొక్కలను తీసుకొచ్చి ప్రదర్శనలో ఉంచారు. సుమారు మూడు వందల రకాలపైగా గులాబీ, ఐదు వందల రకాలకు పైగా చామంతి మొక్కలను కాకినాడ, కడియం, పుణె, బెంగళూరు ప్రాంతాల నుంచి కేరళ నుంచి ఆర్కిట్స్, బోన్సాయ్, ఇండో తదితర మొక్కలను ప్రదర్శించారు. సేంద్రీయ, ప్రకృతి పద్ధతిలో సాగుచేసే రైతులకు ప్రత్యేకమైన స్టాల్స్ కేటాయించారు. వీటి వద్ద సెల్ఫీలు దిగేందుకు యువతులు పోటీపడుతున్నారు.