ప్రతిధ్వని: ప్లేట్ ఏదైనా.. పర్మిట్ ఒకటే..! - భారత్ డిబేట్
🎬 Watch Now: Feature Video
దేశంలో ప్రజా రవాణాకు పర్మిట్ ఒక్కటే. "ఒకే దేశం... ఒకే పర్మిట్" విధానంతో ఇకపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు... నిరభ్యంతరంగా ప్రజా రవాణా జరగనుంది. కమర్షియల్, నాన్ కమర్షియల్ తేడా లేకుండా రాష్ట్రాల సరిహద్దులు దాటుకుని వాహనాలు ప్రయాణికుల్ని చేరవేయొచ్చు. డ్రైవర్లు, వాహనదారుల యోగక్షేమాలను.. సారధి పోర్టల్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దేశంలో ప్రజా రవాణాను ఒక్కతాటిపైకి తేవడం ఈ విధానం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే... ఈ విధానం తమ హక్కులకు భగం కలిగిస్తుందని రవాణా సంఘాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో... ‘ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ పర్మిట్ - 2021’ మార్గదర్శకాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.