స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌లో అబ్బురపరుస్తోన్న ఆక్టోపస్ బృందం - state police duty meet in thirupathi newsupdates
🎬 Watch Now: Feature Video

శత్రువు నుంచి ముప్పు పొంచి ఉందంటే చాలు..మూడోకంటికి తెలియకుండా వారిని కమ్మేస్తారు. భద్రతా సిబ్బంది జాడే తెలియకుండా ఉగ్రమూకల భరతం పట్టేస్తారు. అర్బన్ వార్ ఫేర్ మెళకువలు, యుద్ధతంత్రాల్లో తర్ఫీదు పొందిన నిష్టాణుతులు వారంతా. వారికి మాత్రమే సొంతమైన వ్యూహాత్మక ఆయుధాలతో..సాంకేతిక మిళితమైన పరికరాలతో ఆ కమాండోలు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. తిరుపతి వేదికగా జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ లో ప్రజలకు అవగాహన కలిగేలా అధునాతన ఆయుధాల ప్రదర్శన చేస్తోంది ఆక్టోపస్ బృందం.