సాంప్రదాయ వంటల పోటీలు... ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు - chitthore district latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9186413-711-9186413-1602764961289.jpg)
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎంకేపురంలో సంప్రదాయ వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాగి సంకటి, రాగి రొట్టె, అటుకుల పాయసం, కొర్రల పాయసం, గుత్తి వంకాయ కూర, రాగి లడ్డు, జొన్న లడ్డు, బెల్లం పాయసం వంటి వంటలను వండి ప్రతిభ చాటుకున్నారు. ఉత్తమ వంటలకు నిర్వాహకులు బహుమతులు అందించారు.