తుపాను బాధితులకు అండగా నిలవాలని నేతలకు సీబీఎన్ పిలుపు - సైక్లోన్ ఎఫ్టెక్ట్తో యువగళానికి బ్రేక్ - తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 12:34 PM IST
Yuvagalm Padayatra Stopped Due To Cyclone: తీవ్ర తుపాను నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను కారణంగా వాతవారణ శాఖ రెడ్ అలర్ట్ ఇవ్వటంతో.. పాదయాత్రకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. పాదయాత్రను ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో.. పొన్నాడ శీలంవారిపాకల వద్ద నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, ఈదురుగాలులు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఈనెల 7న నుంచి శీలంవారిపాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయించిన్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.
CBN Responded on Cyclone Michaung ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత: తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తుపాను కారణంగా రైతులకు నష్టం సంభవిస్తుందని.. రైతులు నష్టపోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా.. ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. కొనుగోలు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోన్నారని.. తుపాను బాధితుల కోసం షెల్టర్లు, ఆహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని.. బాధితులకు అండగా నిలవాలని, చేతనైనా సాయం అందించాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు.