YSRCP Wide Meeting Jagan with Party Members: నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. - వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 10:46 AM IST

YSRCP Wide Meeting Jagan with Party Members: ఎన్నికలకు సిద్ధమవడమే ఎజెండాగా ఆ పార్టీ అధినేత జగన్‌ నేడు.. వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి.. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జగనన్న గృహ సారథుల సమన్వయకర్తలు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు కార్యాచరణను జగన్​ ప్రకటించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించి 16 నెలలైనా, మధ్యలో హెచ్చరించినా పూర్తిస్థాయిలో పాల్గొనని ఎమ్మెల్యేల భవితవ్యంపైనా.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టతనిస్తారని చెబుతున్నారు. 

గడప గడపకు కార్యక్రమం ముగింపు సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ఎజెండా ప్రకటించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ఈ సభల్లో మాట్లాడాలని.. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడానికీ వీటిని వినియోగించుకునేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనేలా రూపొందించిన ప్రణాళికను వెల్లడిస్తారని సమాచారం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.