వైఎస్సార్​సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు - ఆ ముగ్గురికి ఛాన్స్ - చిత్తూరు ఎమ్మెల్యే

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 12:30 PM IST

YSRCP Selected Rajya Sabha Candidates : రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అధికార పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీకి చెందిన సీఎం రమేశ్‌ పదవీకాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది. ఈ క్రమంలో వచ్చే నెలాఖరులో ఈ మూడు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలవనుంది. అయితే పదవీ కాలం ముగియనున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించనున్నారు. 

పదవీకాలం పూర్తైన ఈ మూడు స్థానాలకూ కొత్త అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్‌ ఎంపిక చేశారు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌, జగన్‌ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను రాజ్యసభకు ఖరారు చేశారు. బుధవారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. విస్తృత చర్చల అనంతరం ఈ ముగ్గుర్నీ వైఎస్సార్​సీపీ ఎంపిక చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.