రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైసీపీ నేతలు - 16లక్షల ఓట్లు తొలగించాలని ఫిర్యాదు - YSRCP Ministers news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 5:25 PM IST
YSRCP Ministers Complaint Votes in Two States: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లు కలిగిన వారిని గుర్తించి, వారి పేర్లను రాష్ట్ర ఓటరు జాబితాల్లోంచి తొలగించాలని.. వైఎస్సార్‌సీపీ మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొందరికి.. ఏపీ, తెలంగాణలోనూ ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సుమారు 16 లక్షల మంది రెండు రాష్ట్రాల్లో ఓట్లు కల్గి ఉన్నారని, వారిని గుర్తించి జాబితాలను సవరించాలని కోరామని మీడియాకు వివరించారు.
YSRCP Ministers Comments: ''ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో ఓట్లు కలిగిన వారికి సంబంధించి..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశాం. రెండు రాష్ట్రాల్లో ఓట్లు కలిగిన వారిని గుర్తించి, వారిని జాబితాల్లో నుంచి తొలగించాలని కోరాం. నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి దేశంలో ఒకచోటే ఓటుహక్కు ఉండాలి. కానీ, కొంతమంది తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుని, మళ్లీ ఏపీలోనూ ఓటు వేస్తున్నారు. ఇలాంటి వారు దాదాపు 16 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో ఓటుహక్కు కలిగి ఉన్నవారికి ఏపీలో ఓటు తీసివేయాలని ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌ని కోరాం. వచ్చే ఎన్నికల్లో ఎలాగు ఓడిపోతామనే ఉద్దేశ్యంతోనే టీడీపీ ఎన్నికలకు ముందే మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది.'' అని వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించారు.