కోడుమూరు వైసీపీలో అసమ్మతి - స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారని శ్రేణుల ఆగ్రహం - ycp Incharges
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 7:01 PM IST
YSRCP Leaders Meet Against Incharge Change: వైసీపీలో ఇన్‌ఛార్జిల మార్పుతో మొదలైన అసమ్మతి జ్వాలలు చల్లారలేదు. టికెట్ దక్కని నేతలు, వారి అనుచరులు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో ఇన్‌ఛార్జ్‌ల మార్పు ప్రక్రియ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ సతీష్‌ను అధిష్ఠానం ప్రకటించింది. స్థానికేతరుడు అయిన డాక్టర్ ఆదిమూలపు సతీష్‌కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ అనుచరులు భగ్గుమంటున్నారు.
అధిష్ఠాన నిర్ణయానికి వ్యతిరేకంగా బి.తాండ్రపాడులో నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. కోడుమూరు నియెజకవర్గంలో మురళీ కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ గ్రామ స్థాయిలో బలపడిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో మురళీకృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇవ్వకపోవడంతో పార్టీ భారీగా నష్టపోతుందని హెచ్చరించారు. మురళీకృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి నమ్మబలికి మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సతీష్‌ను తప్పించి మురళీకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే పార్టీకి సహకరించబోమని తేల్చిచెప్పారు. అధిష్ఠానం ఇప్పటికైనా స్పందించి కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీ కృష్ణను ప్రకటించాలని డిమాండ్ చేశారు.