YCP Leaders Demolished Walls: ఇంటి గోడలు కూల్చి.. ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూ - ap news
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders Demolished House Walls : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. తన ఇంటి గోడలు కూల్చారని ఓ కుటుంబం ఆరోపిస్తోంది. పేరేచర్ల గ్రామానికి చెందిన మందా కనికరం కుటుంబ సభ్యులు 1993 సంవత్సరంలో వాగు పోరంబోకులో రెండు సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ పూరిపాక వేసుకొని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆ స్థలంలో రేకులు ఇల్లు కట్టుకునేందుకు సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టారు. అయితే ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కొంత కాలంగా కొందరు వైఎస్సార్సీపీ నాయకులు దేవరకొండ సరోజిని, ఆమె భర్త బాబురావు మందా కనికరంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జేసీబీ సాయంతో అక్రమంగా ఇంటి గోడలు కూల్చారని బాధితురాలు వాపోయారు. ఎందుకు కూలుస్తున్నారని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని, బూతులు తిట్టారని బాధితురాలు మందా కనికరం ఆరోపించింది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దేవరకొండ సరోజిని, ఆమె భర్త బాబురావు, వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.