YSRCP Leaders Attack on Pregnant: వైసీపీ నేతల అరాచకం.. 'జగనన్న సురక్ష'లో గర్భిణిపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2023, 10:10 PM IST

Updated : Jul 7, 2023, 10:56 PM IST

YCP Leaders Attacked Pregnant Woman: అధికారపార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తాజాగా వైసీపీ నాయకుల దాడిలో నిండు గర్భిణి గాయాలపాలైంది. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం వెంగళాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో  సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. మండలంలోని దివాకర్ పల్లికి చెందిన నిండు గర్భిణి నీలం నరసమ్మ తన భర్తతో కలిసి కార్యక్రమానికి విచ్చేశారు. వారిపై అధికారుల సమక్షంలోనే దౌర్జన్యం చేస్తూ.. బాధితులపై భౌతిక దాడికి దిగారు. అధికారులకు తన సమస్యను వివరిస్తుండగా.. వైసీపీ నాయకులు ఒక్కసారిగా వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో గర్భిణి కిందపడటంతో గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా దాడి చేయడంతో.. సభా ప్రాంగణంలోని ప్రజలు దాడి చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో కార్యక్రమానికి వచ్చిన అధికారులు, స్థానిక ప్రజలు అక్కడి నుంచి భయంతో వెళ్లిపోయారు. దాడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఏం జరిగిందంటే: దివాకరపల్లి గ్రామానికి చెందిన నరసమ్మను రేషన్‌కార్డు పని ఉందని.. సచివాలయం దగ్గరకు రావాలని రెండ్రోజుల క్రితం వాలంటీర్ చెప్పాడు. దీంతో  తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి నరసమ్మ గురువారం సచివాలయానికి వెళ్లింది. ఆ సమయంలో పంచాయతీ కార్యదర్శి మల్లీశ్వరి, గ్రామ వాలంటీర్.. నరసమ్మ, ఆమె భర్తపై దుర్భాషలాడారు. మీ ఇంటిముందు రోడ్డుపైకి మురుగు నీరు వదులుతున్నావు.. రాకుండా చూడాలని.. లేదంటే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. దీనిపై జగనన్న సురక్ష కార్యక్రమంలో అధికారులకు చెప్పేందుకు నరసమ్మ కుటుంబ సభ్యులతో పాటు వచ్చారు. ఈ సమయంలోనే వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో తహసీల్దార్​కు సమస్య చెప్తున్న సమయంలో వైసీపీ నాయకులు వచ్చి.. మీకు ఇక్కడేం పని, మీరు టీడీపీ సానుభూతిపరులు.. అంటూ దుర్భాలాషలాడుతూ దాడి చేశారు. 

Last Updated : Jul 7, 2023, 10:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.