Prathidwani: ఏళ్లు గడుస్తున్నాయి.. మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పుడో..? - పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పుడు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2023/640-480-18965082-39-18965082-1689005123642.jpg)
YSRCP Government Neglects Polavaram: పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారు? ఈ ప్రశ్న పాతదే సమాధానాలే మారుతున్నాయి. జగన్ అధికార పీఠమెక్కింది మొదలు రివర్స్ అంతా రివర్స్ బాటలోనే సాగుతోంది ప్రాజెక్టు పురోగతి అంతా. గడువు మీద గడువులన్నీ మారి.. ఇప్పుడు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అన్నట్లు.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్న మాటే నిజమయ్యేలా మారాయి పరిస్థితులు. అసలు.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటి ఈ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్ధేశం వైసీపీ ప్రభుత్వానికి ఉందా లేదా? కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి రైతు సంఘాలు, విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు కూడా ఇవే. అసలు పోలవరం విషయంలో ఏం జరుగుతోంది? అబద్దాలు చెప్పడం రాదు, మోసం చేయడం రాదు అని ప్రతి సందర్భంలో చెప్పే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఆయన గణం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే గడువులు చెబుతున్నది.. చేస్తున్నది ఏమిటి? 25మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి మరీ హామీలు సాధిస్తా, పోలవరం పరుగులు పెట్టిస్తా అని.. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో అనేకసార్లు దిల్లీ వెళ్లి సాధించింది ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని