YS Jagan Opens Srinivasa Setu Flyover: శ్రీనివాస సేతును ప్రారంభించిన సీఎం జగన్​.. తితిదే ఉద్యోగులకు ఇళ్లపట్టాల పంపిణీ - ఏపీ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 9:10 PM IST

YS Jagan Opens Srinivasa Setu Flyover: తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్వవాల నేపథ్యంలో తిరుపతి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ నేడు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీనివాస సేతును ప్రారంభించారు. నగరానికే తలమానికంగా నిలిచిన శ్రీనివాస సేత్ ప్లైఓవర్‌ను ప్రారంభించిన  సీఎం.. ప్రజలకు అంకితమిచ్చారు. రూ.650 కోట్లతో శ్రీనివాస సేతును తితిదే నిర్మించింది. దాదాపు 7 కిలోమీటర్ల పొడవైన ఈ పైవంతెనతో తిరుపతి ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతోపాటు.. భక్తులు నేరుగా అలిపిరికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని సైతం సీఎం ప్రారంభించారు. రచన, వకుళామాత అతిథి గృహాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం తితిదే ఉద్యోగులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు. అనంతరం  తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. వేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం బయలుదేరారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.