వరంగల్ నిట్‌లో ఉత్సాహంగా సాగుతోన్న యూత్ ఫెస్ట్ - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
తెలంగాణల రాష్ట్రం వరంగల్ నిట్‌లో యూత్ ఫెస్ట్ ఉత్సాహంగా జరుగుతోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని.. ప్రతి ఏడాది జనవరిలో ఈ ఫెస్ట్ నిర్వహిస్తారు. కళాశాల మైదానంలో.. ఫిట్‌నెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్ధుల టగ్ ఆఫ్ వార్ సరదా సరదాగా సాగింది. ఈ పోరులో విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇంకా విద్యార్థుల్లో సృజనాత్మకతను చాటి చెప్పే విధంగా.. గులకరాళ్లపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలలో విద్యార్థినులు పాల్గొన్నారు. ఇవి అందరికీ ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు గులకరాళ్లపై స్ట్రాబెర్రీ, సరస్సు, పచ్చని చెట్ల బొమ్మలను అందంగా రంగులతో తీర్చిదిద్దారు. ఇంకా బెలూన్ గేమ్‌లో కూడా విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తిలకించారు. చిన్నప్పటి ఆటలు స్పూన్ గేమ్‌లో కూడా విద్యార్థినులు పాల్గొని ఆనందంగా గడిపారు. అదేవిధంగా విద్యార్ధులు పలు రకాల ఆటలు ఆడి సందడిగా గడిపారు.
విద్యార్థులు ఛాయాచిత్ర ప్రదర్శనలోనూ పాల్గొన్నారు. దేశ నలుమూలలకు వెళ్లి తీసిన అనేక రకరకాల ఫోటోలను ఎంతో ఆసక్తితో తిలకించారు. ప్రకృతి అందాలను చూపిస్తూ.. ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఛాయా చిత్రాలను తీయడం, అవి మరలా ఇలా ఎగ్జిబిషన్ టైప్‌లో పెట్టడం.. తమకు ఏదో తెలియని అనుభూతిని మిగుల్చుతున్నాయని విద్యార్థులు వాపోయారు. యూత్ ఫెస్ట్ .. ఆద్యంతం అనేక రకాల ఆటలతో సందడిగా సాగుతోందని చెప్పారు. స్పీకింగ్ షాడోస్, మ్యాజిక్ షో, మినీ గేమ్ ఫేర్ అనే గేమ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫుడ్ స్టాల్స్, కల్చరల్ నైట్ అనే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.