కొంప ముంచిన సరదా - ప్రమాదవశాత్తు జలాశయంలో పడిన యువకుడు, రెండు రోజులైనా దొరకని ఆచూకీ - Anantapur young man fell into water
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 5:08 PM IST
Young Man Fell into Water didnt get Information In ATP: అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని మధ్య పెన్నార్ జలాశయంలో యువకుడు గల్లంతయ్యాడు. ఉరవకొండకి చెందిన ఆర్య ఆదివారం మిత్రులతో కలిసి సరదాగా జలాశయానికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం ఆర్య, స్నేహితులతో కలిసి జాలర్లకు సంబంధించిన తెప్పను తీసుకుని జలాశయంలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆర్య జలశయంలో పడిపోయాడు. రెండు రోజులైనా ఆర్య ఆచూకీ లభించకపోవటంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.
Arya has not been Found for Two Days: ఆదివారం సాయంత్రం జాలర్ల సాయంతో ఆర్య కోసం గాలింపు చేపట్టిన చీకటి పడడంతో ఆచూకీ దొరకలేదని స్థానికులు చెబుతున్నారు. యువకుడు గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టిన లాభం లేకపోయింది. గత రెండు రోజులు ఆర్య కోసం యధావిధిగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. బాధితుని తల్లిదండ్రుల రోదనలతో ఘటనా ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.