భార్యను అమ్మైనా డబ్బు చెల్లించాల్సిందే - వైసీపీ కౌన్సిలర్ వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం - వైసీపీ నేతల వేధింపులకు యువకుడు ఆత్మహత్యయత్నం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 10:41 AM IST
Young Man Attempted Suicide due to Harassment by YCP Leaders : వైసీపీ కౌన్సిలర్ వేధింపులతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. శాంతీనగర్‌కు చెందిన ఇలియాజ్ అనే యువకుడు చీరల వ్యాపారం చేస్తుంటాడు. స్థానిక వ్యాపారులైన తేజ, బాలకృష్ణ వద్ద వ్యాపార నిమిత్తం 20 పట్టు చీరలు తీసుకున్నాడు. అందులో ఆరు మాత్రమే అమ్ముడుపోవడంతో 14 చీరలు వెనక్కి ఇచ్చాడు. ఆరు చీరలకు డబ్బు చెల్లిస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించని వ్యాపారులు ఇద్దరు స్థానిక వైసీపీ నాయకులు రెడ్డప్ప, కౌన్సిలర్ నారాయణరెడ్డి లను పిలిపించి పంచాయతీ పెట్టించారు.
అయితే కౌన్సిలర్, వైసీపీ నేత రెడ్డప్ప కలిసి ఇలియాజ్ను బెదిరించి మెుత్తం 41 పట్టు చీరలకు డబ్బు ఇవ్వల్సి ఉందని తెల్ల కాగితంపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. భార్యను అమ్మైనా తనకు డబ్బు చెల్లించాలని కౌన్సిలర్ వేధింపులకు పాల్పడ్డారు. కౌన్సిలర్ మాటలతో తీవ్ర మనస్థాపం చెందిన ఇలియాజ్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై ధర్మవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.