YCP trying to remove the votes of TDP supporters టీడీపీ మద్దుతుదారు ఓట్ల తొలగింపుకు కుట్రకు తెరలేపుతున్న వైసీపీ నేతలు - అనంత రామగిరి న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-08-2023/640-480-19262597-thumbnail-16x9-tdp-votes-issue.jpg)
YCP trying to remove the votes of TDP supporters ఎన్నికల్లో గెలవలేమని తెలిసి వైసీపీ నాయకులు.. టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి కుట్ర చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ నాయకుల ఆరోపించారు. రామగిరి మండలంలోని నసనకోట గ్రామపంచాయతీలోని 33 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి వైసీపీ నాయకులు దరఖాస్తు చేసినట్లు తెలిసిందన్నారు. ఆ దరఖాస్తు చేసిన వాటిల్లో టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులుల పేరు ఉందని టీడీపీ నాయకులు అన్నారు. దీనిపై ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇలాంటి కుట్రకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే టీడీపీ నాయకులు రామగిరి మండల తహశీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టీడీపీ మద్దుతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్లును తొలగిస్తున్న స్థానిక అధికారులు మాత్రం ఏమి చేయకుండా చూస్తూ ఉండటం సరికాదన్నారు. ఓట్లు తొలగించడానికి చేస్తున్న ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు నిఘా వేయాలని టీడీపీ నాయకులు కోరారు.