నిస్సిగ్గుగా వైసీపీ బస్సుయాత్ర సభ - జనాలు లేకపోయినా కెమెరాల ముందు బిల్డప్ - YCP Bus Yatra News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 7:38 PM IST
|Updated : Dec 16, 2023, 8:22 PM IST
YCP Samajika Sadhikara Bus Yatra Utter Flop: వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర రాష్ట్రంలో తుస్సు యాత్రగా సాగుతోంది. వీరి సభలకు జనం రాకపోయినా నాయకులు బెదిరించి తీసుకొస్తున్నారు. నాయకుల ప్రసంగాలు మొదలైన కొద్దిసేపటికే జనం ఇంటి ముఖం పడుతున్నారు. తాజాగా చిత్తారు జిల్లాలో వైసీపీ బస్సు యాత్ర పేలవంగా సాగింది.
పలమనేరు పట్టణం ఎంబీటీ రోడ్డులో పూర్తిగా రాకపోకలు నిలిపివేసి వైసీపీ నాయకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఉదయం నుంచే ప్రైవేట్ స్కూలు బస్సులలో రెండు పూటలా భోజన వసతి కల్పిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా జనాలను తరలించారు. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంత తాపత్రయపడినా సభ మొదలైన పది నిమిషాలకే జనం ఇంటి ముఖం పట్టారు. సభా ప్రాంగణం ఖాళీ అవడంతో చేసేదేమీ లేక అనుకున్న సమయం కంటే ముందుగానే బస్సు యాత్ర ముగిసింది. ఈ బస్సు యాత్ర వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ బారికేట్లతో రోడ్లు బ్లాక్ చేశారు. ఆర్టీసీ ప్రయాణాలు ఆగిపోయాయి. సొంత వాహనాలలో ప్రయాణం చేసేవారు కూడా డైవర్షన్ల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.