YCP MPTCs and Sarpanches Protest: ఎందుకీ సమావేశాలు.. పెట్రోలు దండగ.. వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచుల ఆగ్రహం - YCP MPTCs and Sarpanches unhappy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 10:27 AM IST

MPTC and Sarpanches Protest: కృష్ణా జిల్లా కోడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతుండగానే సభ నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు బయటికి వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చి మీరు ఇచ్చే బిస్కెట్ టీ తాగి వెళ్లడం తప్ప.. తమకు ఏ ఉపయోగం లేదన్నారు. సమావేశానికి వచ్చేందుకు వంద రూపాయలు పెట్రోల్ కూడా దండగని అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏ ఒక్క పని చేయకుండా ఓట్లు వేసిన ప్రజలకు ముఖం ఎలా చూపించాలని ప్రశ్నించారు. గ్రామంలో తాగు నీరు, రోడ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇంటింటికీ కుళాయి ఎక్కడని.. ఎప్పుడు పూర్తి అవుతుందని వాపోయారు. వచ్చే ఎలక్షన్ సమయంలో గడప గడపకు ఓట్లు అడగడానికి వెళితే జనం చొక్కా పట్టుకునేటట్లు ఉన్నారని మండిపడ్డారు. మద్యం అమ్మకాలపై గత 25 సంవత్సరాలుగా ఉన్న గ్రామ కట్టుబాట్లను తుడిచిపెట్టారన్నారు. మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని వాపోయారు. దీనిపై ఎంపీడీవో.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.