YSRCP MLA Against CBN Arrest : 'రాష్ట్రానికి సీఎం జగన్ ద్రోహం'... చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్షలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే - ap news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 7:30 PM IST

YCP MLA Undavalli Sridevi Participated in Relay Hunger Strike : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయ్యిందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లు గ్రామంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఎటువంటి అభివృద్ధి లేకుండా ప్రజలకు నవరత్నాల పేరుతో పది పైసలు విసురుతూ 100 రూపాయలు భారాన్ని మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఈ ప్రభుత్వంలో పని చేసే ఎమ్మెల్యేలకు ఇతర ప్రజా ప్రతినిధులకు ఎటువంటి విలువలు లేకుండా వారి జీవితంలో కూడా మచ్చ తెస్తున్నారని ఆరోపించారు. 

ఎంతో ముందు చూపుతో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగా చేసిన కృషిని నేరంగా పరిగణించి, అక్రమ కేసులు బనాయించడం తగదని ఆమె హితవు పలికారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రభుత్వాన్ని, మంచి పాలనను అప్పగించాల్సిన బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.