Anil Kumar challenge to Lokesh: ప్రమాణానికి సిద్ధం.. లోకేశ్ ఆరోపణలపై అనిల్‌కుమార్ - anilkumar clarity on lokesh allegations
🎬 Watch Now: Feature Video
YCP MLA Anil Kumar on Lokesh Allegations: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్లు చేసిన ఆరోపణలపై.. ప్రమాణం చేసేందుకు తాను సిద్దమని అనిల్ కుమార్ ప్రకటించారు. నగరంలోని వెంకటేశ్వరపురం వద్దనున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రమాణం చేస్తానని ఆయన వెల్లడించారు. వెయ్యి కోట్ల ఆస్తులు తనవేనని ప్రమాణం చేసే దమ్ము.. లోకేశ్‌కు ఉందా అంటూ అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ప్రమాణానికి లోకేశ్ వచ్చినా, రాకున్నా తాను మాత్రం ప్రమాణం చేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తులే అమ్ముకున్నానని తెలిపారు. తనకు నెల్లూరు జిల్లాలో తప్ప దేశంలో ఎక్కడా ఆస్తులే లేవని అనిల్ కుమార్ ప్రకటించారు. గతంలో తన తండ్రి ఇచ్చిన ఆస్తులు అమ్మి కొంత భూమి కొనుగోలు చేశానన్నారు. వెయ్యి కోట్ల ఆస్తి అని చెబుతున్న లోకేశ్ అవి తనకు ఇప్పించాలన్నారు డిమాండ్ చేశారు.