బాపట్ల వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి - ఆమంచి వైఖరిపై నేతలు ఫైర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 8:10 PM IST
|Updated : Nov 28, 2023, 8:31 PM IST
YCP Leaders Fire on Amanchi Krishnamohan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని, కార్యకర్తల పట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా జగన్ ముద్దు.. ఆమంచి వద్దు అంటూ వైసీపీ అసమ్మతి నేతలు గళమెత్తిన సంఘటన బాపట్ల జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
MPP Komatla Ankamma Reddy Comments: బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెంలో వైసీపీ అసమ్మతి నేతలు.. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ వైఖరిని వ్యతిరేకిస్తూ.. మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపాలెంలో నిర్వహించిన సభలో ఆమంచిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా చినగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మారెడ్డి మాట్లాడుతూ..''ఆమంచి కృష్ణమోహన్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారు. వైఎస్ జగన్ పేరు చెప్పి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన (ఆమంచి) దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆయన బెదిరింపులకు బెదిరిపోయేవారు ఎవరూ లేరు. ఆమంచికి ఇన్‌ఛార్జ్ పదవి తీసేస్తే ఎందుకు పనికిరారు. త్వరలోనే పార్టీ పెద్దలతో ఈ వ్యవహారంపై చర్చిస్తాం. జిల్లాలో పార్టీ పెద్దగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై దుర్భాషలాడటం సరికాదు. ఇప్పటికైనా ఆమంచి అతని వైఖరి మార్చుకోవాలి'' అని అంకమ్మారెడ్డి హెచ్చరించారు.