YCP Leaders Land Scam: ప్రభుత్వ భూమిలో నివాసముంటున్న పేదల స్థలంపై వైఎస్సార్సీపీ నేతల కన్ను - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు
🎬 Watch Now: Feature Video
YCP Leaders Eye on Poor People Lands in Visakha: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం పిట్టపేటలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదల స్థలంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేశారు. అధికార బలంతో.. కొంత మంది స్థిరాస్తి వ్యాపారుల కోసం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో రోడ్లు, గెడ్డపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించారు. సర్వే నెంబర్ 60లో నాలుగు ఎకరాల 46 సెంట్లు ప్రభుత్వ భూమిలో 50 సెంట్లలో పూరిపాకలు వేసుకుని పేదలు జీవనాన్ని సాగిస్తున్నారు. గొర్రెలు, మేకలు, ఆవులను పెంచుకుంటూ తాతల కాలం నుంచి అక్కడే బతుకుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ దంతులూరి వెంకట శివసూర్యనారాయణరాజు అలియాస్ వాసురాజు తమని బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. జగనన్న ఇళ్ల స్థలాలు 25 మందికి అందజేయాలంటూ అధికారులను పక్క దోవ పట్టించారని బాధితులు ఆరోపించారు. పేదలకు అండగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు N. రాజు, స్థానిక నేతలు అక్కడి వెళ్లి MPP ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.