YCP Leaders Attacked on TDP Leaders: రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. మహిళ అని చూడకుండా.. - పులికల్లు పంచాయతీ చెర్లోపల్లెలో గొడవలు
🎬 Watch Now: Feature Video
YCP Leaders Attacked on TDP Leaders: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ చెర్లోపల్లెలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగాయి. చెర్లోపల్లె గ్రామంలో.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దాదాపు టీడీపీ మద్దతుదారులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఐదు కుటుంబాలు వ్యక్తిగత కారణాల రీత్యా వైసీపీలో చేరినట్లు సమాచారం. గ్రామ పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎదుట.. వైసీపీ నేతలు తమ ఆధిపత్యం ప్రకటించుకునే నేపథ్యంలో సదరు వైసీపీ మద్దతుదారుల కుటుంబాలు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై అసత్య ఆరోపణలకు దిగారు.
తమ గ్రామంలో విద్యుత్ సరఫరాకు తెలుగుదేశం నేతలు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని ఆరోపించారు. తాము గడప గడప కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురి చేశారంటూ.. ఉప ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు. వైసీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి గ్రామంలోని ఓ టీడీపీ నేతను పిలిపించాలని అధికారులను ఆదేశించారు. సదరు వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో అతని భార్యను అధికారులు, ప్రజలు ఎదుట విద్యుత్ సరఫరా విషయమై ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి ఎదుట.. వైసీపీ మద్దతుదారులు సదరు మహిళను నిందించడంతో మనస్థాపానికి గురైన టీడీపీ మద్దతురాలైన మహిళ రోదిస్తూ ఇంటికి వెళ్లింది. ఆ మహిళ ఏడుస్తూ వెళ్లడాన్ని గమనించిన గ్రామస్థులు వైసీపీ మద్దతుదారులును వివరణ కోరేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డాయి.