జనసేన నేతపై వైసీపీ నాయకుల దాడి, నెల్లూరులో ఆందోళన - జనసేన ఆత్మకూరు ఇన్‌ఛార్జి శ్రీధర్ పై దాడి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-11-2023/640-480-20018062-thumbnail-16x9-ycp-leaders-attacked-on-janasena-leader-in-nellore-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 11:56 AM IST
YCP Leaders Attacked on Janasena Leader in Nellore District : ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం హేయమైన చర్యని నెల్లూరు జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వూరు ఇసుక రీచ్‌లో జరుగుతున్న అక్రమాలపై నిలదీసిన జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నలిశెట్టి శ్రీధర్ పై.. అధికారపార్టీ నేతలు దాడికి పాల్పడటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ దాడిని వ్యతిరేకిస్తూ.. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, దాడులు ఎక్కువయ్యాయని.. సామాన్య ప్రజలకు కనీసం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికారి ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త సురేష్, కోవూరు సమన్వయకర్త హరిరెడ్డి పాల్గొన్నారు.