'తాగడానికి, వాడకానికి అవే' చెంబులతో లెక్కపెట్టి నీళ్లిస్తున్నారంటూ జనం కన్నీళ్లు! - నీటి సమస్య వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 12:42 PM IST
YCP Government Not Solve Water Problem In Guntur: గుంటూరు జిల్లా కృష్ణా నది సమీపంలోని మదర్ థెరిసా కాలనీలో నీరు లేక త్రీవ ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు. నగర శివారు కాలనీలకు ఇప్పటికీ నీటి వసతి కల్పించలేని స్థితిలో పాలకులు ఉన్నారని స్థానికులు మండిపడ్డారు. గతంలోనే పైపులైన్లు వేసినా వాటిని ట్యాంకులకు అనుసంధానించి నీరు అందించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి కోసం ఎదురుచుడాల్సిన పరిస్థితి చాలా కాలనీల్లో నెలకొందన్నారు.
ఈ ప్రాంతంలో గత 30 ఏళ్లుగా నివాసముంటున్నా నేటికీ పైపులైన్ల ద్వారా నీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని కాలనీవాసులు మండిపడుతున్నారు. వారానికో లేక 10 రోజులకో ఒకసారి వచ్చే నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు పడిగాపులు గాస్తున్నామన్నారు. కాలనీవాసులు నీటిని అవసరాలకు కొలతలు వేసుకుని వాడుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పైపులైన్లు వేసినా నీరు అందించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.