స్థలం కోసం వైసీపీ కౌన్సిలర్ వేధింపులు, దాడి - రక్షించాలని ఆర్మీ జవాన్ భార్య ఆవేదన - YCP Councillor Harassing army jawan wife
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 6:56 PM IST
YCP Councillor Harassing Woman in Land Issue: సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న తమపై.. పిడుగురాళ్ల 16 వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, అతని అనుచరులతో దాడులకు పాల్పడుతున్నాడని ఇండియన్ ఆర్మీ జవాన్ భార్య మోహనసాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న స్థలంలో ఇప్పటికే ఏడు అడుగులు రోడ్డు కోసం వదిలేసినా.. మరింత స్థలం కావాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.
అందుకు తాము అంగీకరించకపోవడంతో తనపై, కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. దీంతో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో (Spandana Program) ఎస్పీ రవి శంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన భర్త ఓవైపు దేశం కోసం పోరాడుతుంటే.. తమకు మాత్రం ఇక్కడ రక్షణ లేకుండా పోయిందని.. వైసీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించుకుంది. ఈ విషయమై ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డికి తెలిపినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయింది. కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి వేధింపుల నుంచి తనను, తన కుటుంబసభ్యులను కాపాడాలని బాధితురాలు మోహన సాయి వేడుకున్నారు.