ఆర్టీసీ డ్రైవర్లతో మున్సిపల్ వాహనాలు నడిపేందుకు యత్నం - అడ్డుకున్న కార్మికులు - శ్రీకాకుళంలో కార్మికులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 3:18 PM IST
Workers Blocking Municipal Vehicles: శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికులు(Municipal Workers) పారిశుద్ధ్య వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ల (RTC Drivers) సహాయంతో మున్సిపల్ వాహనాలను తీసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో కమిషనర్ చల్లా ఓబులేశు, కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మున్సిపల్ వర్కర్లు వాహనం ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
Municipal Workers Protest in Srikakulam: మున్సిపల్ వాహనాల (Municipal Vehicles) ను పర్మినెంటు ఉద్యోగులతో తీసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వీరు ఒక వాహనాన్ని విడిచి పెట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మంగళవారం నుంచి సమ్మె చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.