మాకు రేషన్ బియ్యం పంపిణీ చేయండి మహోప్రభో: మహిళలు - Womens Protest about Not Give Ration Rice
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 9:36 PM IST
Womens Protest about Not Give Ration Rice: ప్రతినెలా పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని గత రెండు నెలలుగా ఇవ్వడం లేదంటూ అనంతపురం జిల్లా 5వ డివిజన్ మహిళలు ఆవేదన చెందారు. సచివాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రేషన్ బియ్యం ఇవ్వని సచివాలయాలు తమకు వద్దంటూ 'సచివాలయం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. రేషన్ బియ్యం రాక కాలనీలోని ప్రజలందరూ ఆకలి మంటలతో అలమటించి పోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్, అధికారులు స్పందించి బియ్యాన్ని అందించాలని వేడుకున్నారు.
Womens Comments: ''మాకు రెండు నెలలుగా రేషన్ బియ్యం రావటం లేదు. మా కార్పొరేటర్ మా గురించి పట్టించుకోవటం లేదు. సచివాలయ అధికారి, వీఆర్వోలు వారికి సంబంధం లేదని చెప్తున్నారు. మరి మేము ఎవరినీ అడగాలి ? ఏం తినాలి ? మా కాలనీ వాళ్లంతా నిరుపేదలు. గవర్నమెంట్ పేదలకు ఇస్తున్న బియ్యాన్ని వీళ్లు ఏం చేస్తున్నారు ? స్టోర్ డీలరు, రేషన్ వాహన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డీలర్ కోసం, రేషన్ పంపిణీ చేసే వాహనాల కోసం ఎదురుచూడని రోజు లేదు. రేషన్ రాక మా డివిజన్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. పై అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతూ మేము సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయండి'' అని 5వ డివిజన్ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.