Women Protested at the police station గ్రామానికి తాగునీరుపై హామీ ఇచ్చిన పోలీసులు.. మాట తప్పడంతో స్టేషన్ను ముట్టడించిన మహిళలు
🎬 Watch Now: Feature Video
Women protested at the police station: ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే అధికారులనో, ప్రజా ప్రతినిధులనో ప్రశ్నిస్తారు. లేదంటే సమస్యలు తీర్చాలంటూ అధికారులు, నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీ మహిళలు మాత్రం నీటి సమస్యలు తీర్చాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీ వాసులు గత కొంతకాలంగా తీవ్రమైన తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తమకు శాశ్వతంమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
అధికారల తీరుకు నిరసనగా శివరామిరెడ్డి కాలనీ చెందిన మహిళలు రెండు రోజుల క్రితం ఖాళీ బిందెలతో అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మహిళలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళలు ఎంతకీ శాంతించక పోవడంతో తామే స్వయంగా చొరవ తీసుకోని సోమవారంలోపు తాగునీటి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన హామీతో మహిళలు ఆందోళనలను విరమించారు. అయితే సోమవారం సాయంత్రం నాటికి పోలీసులు ఇచ్చిన గడువు ముగిసినా.. తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో శివరామిరెడ్డి కాలనీ మహిళలు ఈ సారి రోడ్డుపై కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారంటూ పోలీసులను, ఆర్డబ్ల్యూఎస్ ఆధికారులను నిలదీశారు.
తాము గత కొంతకాలంగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని మహిళలు అగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీకు తాగునీటిని సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు. లేని పక్షంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడికి బందెలతో వచ్చిన మహిళలకు పోలీసులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
TAGGED:
mahelallu niladetha